ETV Bharat / bharat

అయోధ్య కేసు: మధ్యవర్తిత్వం కొనసాగింపు

author img

By

Published : Jul 18, 2019, 12:14 PM IST

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది మధ్యవర్తిత్వ కమిటీ. పరిశీలించిన సుప్రీం ధర్మాసనం మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని ఆదేశించింది. ఆగస్టు 1న మరో నివేదిక సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

అయోధ్య కేసు: మధ్యవర్తిత్వం కొనసాగింపు

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది మధ్యవర్తిత్వ కమిటీ. నివేదికను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని కమిటీని ఆదేశించింది. జులై31వరకు సాధించే పురోగతిపై ఆగస్టు 1న మరో నివేదిక సమర్పించాలని తెలిపింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులో మరింత విచారణ అవసరమా లేదా అనేది ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది.

మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాల్లో పెద్దగా పురోగతి లేదన్న పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టింది ధర్మాసనం. 18వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు కోర్టుకు నివేదిక అందించింది మధ్యవర్తుల కమిటీ.

ఇదీ కేసు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​ నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది.

జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: 'కుల్​భూషణ్​ జాదవ్ కేసు తీర్పులో సత్యమేవ జయతే'

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 18 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0357: Mexico Migrants Fear AP Clients Only 4220903
Asylum seekers in Mexico fear lurking dangers
AP-APTN-0356: US House Vote Saudi Arms AP Clients Only 4220902
US House votes to block sale of weapons to Saudis
AP-APTN-0308: Libya Migrants AP Clients Only 4220900
ONLYONAP: Migrants stranded at Libya detention centre
AP-APTN-0304: Puerto Rico Protest AP Clients Only 4220901
Celebs join protest against Puerto Rico governor
AP-APTN-0248: US Trump NZ Survivor AP Clients Only 4220899
NZ mosque attack survivor thanks Trump
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.