అయోధ్యపై సత్వర విచారణ జరపాలని అభ్యర్థించారు కేసులోని ఫిర్యాదుదారు గోపాల్ సింగ్ విశారద్. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో మధ్యవర్తి కమిటీ ఏర్పాటైనా ఎలాంటి ప్రగతి లేదని ఆరోపించారాయన.
విశారద్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది పి.ఎస్. నరసింహ అభ్యర్థనను పరిశీలించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. సత్వర విచారణ కోసం దరఖాస్తు దాఖలు చేశారా అని ప్రశ్నించింది. స్పందించిన న్యాయవాది అందుకు ఔనని సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి: ఆధార్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం