ఒంటరిగా, ఇంటికే పరిమితమై ఉండటం కష్టమే. మేం మనుషులకీ, భూమికీ కూడా దూరంగానే ఉంటాం. అయినా మేం పాటించే కొన్ని చిట్కాలు మాలోని ఒత్తిడిని తగ్గిస్తాయంటోంది వ్యోమగామి జెస్సికా...
'భూమిపై జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాను. అంతరిక్షం నుంచి మేం తిరిగొచ్చేసరికి ఇదేదో ప్రత్యేక గ్రహంలా తోస్తుందేమో. నాకు తెలుసు ఇంట్లోనే బంధీ అయి ఉండటం కష్టమే. కానీ ఇంట్లో ఉంటూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదెలా అని ఆలోచిస్తున్నారా? మమ్మల్నే చూడండి. భూమికి, ప్రజలందరికీ దూరంగా అంతరిక్షంలో ఉంటున్న మేం ప్రతి రోజూ శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామాలు చేస్తూనే ఉంటాం. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వ్యాయామాలు శారీరకంగా, మానసికంగా మనల్ని శక్తిమంతంగా మారుస్తాయి. ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి దూరం అవుతుంది. ఎవరికి వారు ఇంట్లో ఉంటూనే దూరంగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండాలి. ఇందుకు సామాజిక మాధ్యమాలని వాడుకోండి. అంతరిక్షంలో ఇదే పద్ధతిలో మా ఒంటరితనాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం.'
- జెస్సికా, వ్యోమగామి
ఈమె గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటోంది. అక్కడ నుంచే ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపింది.
ఇదీ చదవండి: కరోనా సోకితే వాసన గ్రహించలేమా?