గాలి దుమారానికి ఉత్తర్ప్రదేశ్ అతలాకుతలమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలి దుమారానికి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సుమారు 19 మంది మరణించారు. 48 మంది తీవ్రంగా గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారి తెలిపారు.
"మైన్పురీలో ఆరుగురు మృతి చెందారు. గాలి దుమారం కారణంగా ఎటా, కాస్గంజ్ ప్రాంతాల్లో ముగ్గురి చొప్పున మరణించారు. మొరాదాబాద్, బదాయూ, పీలీభీత్, మథుర, కన్నౌజ్, సంభల్, ఘజియాబాద్ ప్రాంతాల్లో ఒకరు చొప్పున పిడుగుపాటుకు చనిపోయారు. "
- విపత్తు నిర్వహణ కమిషనర్
గురువారం సాయంత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలి దుమారం చెలరేగింది. గాలుల ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. మైన్పురీలోనే అత్యధికంగా 41 మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో పదుల సంఖ్యలో పశువులూ మృత్యువాత పడ్డాయని తెలిపారు అధికారులు.
గాలుల ధాటికి ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
ఇదీ చూడండి: 10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య