ETV Bharat / bharat

కొవిషీల్డ్​, స్పుత్నిక్​-వీ టీకాలు కలిపి ప్రయోగం - స్పుత్నిక్​-వీ

ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యాక్సిన్​ క్యాండిడేట్​తో కలిపి రష్యా స్పుత్నిక్​-వీ డోసులను ప్రయోగించాలని గమలేయ పరిశోధన సంస్థ చేసిన సూచనను అంగీకరించింది. త్వరలోనే ఈ ప్రయోగం చేపట్టనుంది ఆస్ట్రాజెనెకా.

AstraZeneca to use a component of Sputnik V in trials of COVID-19 vaccine: RDIF
టీకా విషయంలో రష్యా ప్రతిపాదనను అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
author img

By

Published : Dec 11, 2020, 7:13 PM IST

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను స్పుత్నిక్-వీ టీకా డోసులతో కలిపి ప్రయోగించాలని రష్యాకు చెందిన గమలేయ పరిశోధన సంస్థ చేసిన సూచనను ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఈ మేరకు రష్యా ప్రత్యక్ష పెట్టుబడి నిధి(ఆర్​డీఐఎఫ్​) శుక్రవారం తెలిపింది.

ఈ తాజా పరిశోధన ద్వారా ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తలకు తమ టీకా సామర్థ్యం పెంచేందుకు ఉపకరిస్తుందని గమలేయ పరిశోధన సంస్థ చెప్పింది. ఈ ఏడాది చివరికల్లా ఈ క్లినికల్​ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. స్పుత్నిక్​-వీ టీకా డోసులతో కలిపి ప్రయోగించాలని ఆస్ట్రాజెనెకాకు నవంబర్​ 23న 'గమలేయ' సూచించింది.

ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​తో కలిసి పుణెలోని సీరం సంస్థ 'కొవిషీల్డ్' పేరుతో​ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను అభివృద్ధి చేస్తోంది.

"స్పుత్నిక్-వీ టీకాతో కలిపి ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న నిర్ణయం.. వ్యాక్సిన్​ సమర్థతను పెంచడంలో అత్యంత కీలకమైనది. మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఇది అందరినీ ఏకం చేస్తుంది."

-- ఆర్​డీఐఎఫ్​ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్​.

రష్యా తయారు చేసిన స్పుత్నిక్​-వీ వ్యాక్సిన్..​ ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా సమర్థతను సాధించినట్లు ఆర్​డీఐఎఫ్​ తెలిపింది.

ఇదీ చూడండి:ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ సురక్షితమే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.