ETV Bharat / bharat

రాజ్​భవన్​లో కరోనా కలకలం.. కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటన! - containment zones in assam

అసోం రాజ్​భవన్​ ఆవరణలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో రాజ్​భవన్​ను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు కామ్​రూప్​ జిల్లా డిప్యూటీ కమిషనర్​. ఆ ప్రాంతాన్ని సీల్​ చేశారు.

Assam Raj Bhavan campus declared containment zone
రాజ్​భవన్​లో కరోనా కలకలం.. కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటింపు!
author img

By

Published : Jul 5, 2020, 10:38 AM IST

అసోం రాజ్​భవన్​లో ఓ కరోనా పాజిటివ్​ కేసు బయటపడింది. దీంతో కామ్​రూప్​ జిల్లా డిప్యూటి కమిషనర్​ బిస్వజిత్​.. రాజ్​భవన్​ క్యాంపస్​ను కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని వెంటనే సీల్​ చేయాల్సిందిగా గువాహటి రెవెన్యూ సర్కిల్​ అధికారులను ఆదేశించారు.

రాజ్​భవన్​కు ఉత్తరాన హోటల్ బెల్లె వ్యూ, దక్షిణాన బోంకోవర్ నగర్, తూర్పున బోర్తాకూర్ క్లినిక్, పశ్చిమాన ఎంజీ రోడ్ వరకు కంటైన్మెంట్ జోన్​ విస్తరించి ఉన్నట్లు స్పష్టం చేశారు అధికారులు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, అసోంలో ఇప్పటికే 10,668 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, వీటిలో 6,657 మంది కోలుకోగా 14 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

ఇదీ చదవండి: ఒకే ఊరిలో ఒకే పేరుతో.. వేలాదిమంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.