ETV Bharat / bharat

'నాన్నా.. నన్ను చంపినా పాడుపనికి వెళ్లను' - నాన్న-కూతురు

ఆడపిల్లను ఒంటరిగా బయటకు పంపితే తన గారాలపట్టికి వంద జాగ్రత్తలు చెప్పి పంపుతాడు తండ్రి. తిరిగి ఇంటికొచ్చేవరకు ప్రాణమంతా బిడ్డ పైనే ఉంటుంది. కానీ కన్న కూతుర్ని వ్యభిచార గృహానికి ఈడ్చాలనుకున్నాడో తండ్రి. నిరాకరించినందుకు పశువు కంటే దారుణంగా చితకబాదాడు ఆ దుర్మార్గపు తండ్రి.

నాన్న.. నన్ను కొట్టినా నేను వెళ్లను!
author img

By

Published : Aug 2, 2019, 6:10 PM IST

నాన్న.. నన్ను కొట్టినా నేను వెళ్లను!
అసోం నాగోన్​లో ఓ కర్కశ తండ్రి అసుర రూపం ఓ వీడియోలో బందీ అయింది. వ్యభిచారం చేయడానికి ఒప్పుకోవడంలేదని సొంత కూతుర్ని చావగొట్టాడు. 15 ఏళ్లు కూడా నిండని ఆ బాలిక.. దెబ్బలకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయినా కనికరించలేదు ఆ నరరూప రాక్షసుడు.

కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్నే... తప్పు చేసేందుకు అంగీకరించలేదని దారుణంగా హింసించాడు. బురదలో దొర్లించి మరీ కొడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు.

పాప బాధ చూడలేక ఓ ముసలమ్మ హృదయం చలించింది.. ఓపిక లేకపోయినా కర్రతో ఆ కఠిన తండ్రిని రెండు దెబ్బలేసింది. కానీ అప్పటికే ఆ పాప తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి చికిత్స పొందుతోంది. క్షమించరాని నేరం చేసి సాక్ష్యాలతో దొరికిపోయిన ఆ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:నది ఉప్పొంగి వరదొచ్చింది.. మొసలి కాలనీకొచ్చింది!

Hyderabad (Telangana), Aug 02 (ANI): Hyderabad Police rescued 847 children from child labour in the year 2019, under 'Operation Smile' initiative. 17 teams each headed by a Sub-Inspector were constituted for the mission. It is a special drive, which is run by the Hyderabad Police.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.