కేరళ కొల్లాం జిల్లాలో ఓ వలస కూలీ అబ్దుల్ అలీ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సమీప బంధువు జలాలుద్దీన్, మరో స్నేహితుడిని కత్తితో నరికి చంపాడు. ఆపై వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడీ కిరాతకుడు.
ఉదయం సమయంలో గేటుకు తాళాలు వేసిన అలీ.. గదిలో ఉన్న స్నేహితుడు, బంధువుపై కత్తితో దాడి చేశాడు. వారి అరుపులు విని వచ్చిన ఇద్దరు వ్యక్తులను కత్తితో బెదిరించటం వల్ల వారు భయపడి పారిపోయారు.
ఆపై ఆత్మహత్యకు..
ఆ తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితుడిని చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియో షేర్ చేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు.. అలీని ఆసుపత్రికి తరలించారు. అతడు కోలుకున్నాక విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. అలీ అసోం నుంచి కొల్లాంకు వలస వచ్చినట్లు గుర్తించారు పోలీసులు.