బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడం వల్ల అసోం అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా మరో ఐదుగురు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 97కు చేరింది. 27జిల్లాల్లో 40 లక్షలమంది ప్రభావితమయ్యారు.
మొత్తం మృతుల్లో 71మంది వరదల కారణంగా చనిపోగా.. కొండచరియలు విరిగిపడటం వల్ల మరో 26 మంది మృతి చెందారు. మరో జిల్లా ముంపునకు గురైంది. పలు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి.
ఇదీ చూడండి: అమెరికాకు విమానాలు రేపటి నుంచే!