అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య మూడుకు చేరింది. దాదాపు 3 లక్షల మంది ప్రభావితమైనట్లు అసోం విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
భారీగా పంట నష్టం
వరదల వల్ల 21,572 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. రహదారులన్నీ పాడైపోయాయి. అనేక చోట్ల నీటి ప్రవాహ ఉద్ధృతికి నదీ తీరం కోతకు గురవుతోందని అధికారులు తెలిపారు.
16 వేల మంది..
16వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 80 పునరావాస శిబిరాలకు వరద బాధితులను తరలించడానికి సంబంధిత జిల్లా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల వరకు బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహించిందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: భారత్లో ఒక్కరోజులో 7466 కేసులు, 175 మరణాలు