ETV Bharat / bharat

'ధరలు తగ్గితే.. మన 'మేధావి' సుంకాలు పెంచారు' - fuel prices in india

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గుతుంటే... ఆ లాభాన్ని దేశ ప్రజలకు అందివ్వకుండా మన మేధావి సుంకాలు పెంచారని మండిపడ్డారు.

Rahul
చమురు ధరల పెంపుపై రాహుల్​ విమర్శలు
author img

By

Published : Mar 15, 2020, 4:30 PM IST

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న వేళ ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు చేరవేయాలని ప్రధానిని తాను అడిగితే.. దానికి బదులుగా మన 'మేధావి' ధరలు పెంచారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Just 3 days ago I had requested @PMOIndia to pass on the benefit of the global oil price crash to Indian consumers, by slashing the prices of petrol & diesel in India. Instead of heeding this advice, our genius has gone and hiked #exciseduty on fuel! pic.twitter.com/lGEQosS9JE

    — Rahul Gandhi (@RahulGandhi) March 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించి.. ఆ ప్రయోజనాన్ని భారతీయులకు అందించాలని నేను మూడు రోజుల క్రితమే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరాను. ఆ సలహాను పట్టించుకోకుండా.. మన మేధావి చమురుపై ఎక్సైజ్​ సుంకాన్ని పెంచారు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​పై లీటరుకు రూ.3 ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.39 వేల కోట్లు ఆదాయం సమకూరనుంది. ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు రాహుల్​.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఓ సమావేశంలో చమురు ధరలు తగ్గించకపోవడానికి గల కారణలు చెప్పేందుకు నిరాకరించిన వీడియోను తన ట్వీట్​తో పాటు ట్యాగ్​ చేశారు రాహుల్​.

ఇదీ చూడండి: చమురుపై సుంకాల పెంపు సరికాదు: కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.