రాజస్థాన్ జైపుర్‌లోని నహర్‌గఢ్ బయోలాజికల్ పార్కులో సిద్ధార్థ్ అనే 8 సంవత్సరాల సింహం కాలేయ సంబంధ వ్యాధితో మరణించింది. పోస్టుమార్టం అయిన తరువాత ఆ సింహానికి పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించినట్లు పార్క్ అధికారులు తెలిపారు.
![Asiatic lion Siddharth dies at Rajasthan's Nahargarh Biological Park, cremated](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:17_rj-jpr-lion-antim-sanskar-02-avb-rj10003_10062020154323_1006f_01631_534.jpg)
"జూన్ 6 నుంచి సిద్ధార్థ్ (సింహం) ఏమీ తినడం లేదు. తాగడం లేదు. దీనితో దాని ఆరోగ్యం బాగా క్షీణించింది. సింహం రక్త నమూనాలను సేకరించి, పరీక్షల కోసం బరేలీలోని ఐవీఆర్ఐకు పంపించాం. దానికి కాలేయ, మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సింహాన్ని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది."
- బయోలాజికల్ పార్కుకు చెందిన ఓ అధికారి
2016లో నహర్‌గఢ్ బయోలాజికల్ పార్కును ప్రారంభించారు. దీనితో జునాగఢ్ పార్కు నుంచి సిద్ధార్థ్ అనే సింహాన్ని నహర్‌గఢ్ పార్కుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ మృగరాజు పార్కుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
![lion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:17_rj-jpr-lion-antim-sanskar-02-avb-rj10003_10062020154323_1006f_01631_487.jpg)
![Nahargarh Biological Park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:17_rj-jpr-lion-antim-sanskar-02-avb-rj10003_10062020154323_1006f_01631_186.jpg)
ఇదీ చూడండి: 'భాజపా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఎరవేస్తోంది'