తక్కువ సమయంలో ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. హరియాణాలో 9 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అందులో అశోక్ పేరు ప్రముఖంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది.
1991 బ్యాచ్ హరియాణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్మా. మొత్తం 27 ఏళ్ల వృత్తి జీవితంలో 52వ సారి బదిలీతో రికార్డు సృష్టించారాయన.
ప్రస్తుతం ఖేమ్కాను రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక విభాగంలో ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రభుత్వం. గత నవంబర్లోనే సామాజిక న్యాయం విభాగం నుంచి యువత, క్రీడల విభాగానికి బదిలీ అయ్యారు.
ఈ విషయంపై స్పందించిన ఖేమ్కా.. ఈ బదిలీలతో తల పేలిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:దేశమంతా శివమయం