ETV Bharat / bharat

'భాజపా కుట్రలకు నిదర్శనం రాజస్థాన్​ సంక్షోభం' - సచిన్​ పైలట్​

సచిన్​ పైలట్​ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించిన అనంతరం గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాను కలిశారు ముఖ్యమంత్రి. సచిన్​ను పదవి నుంచి తొలగించాలన్న గహ్లోత్​ ప్రతిపాదనను మిశ్రా అంగీకరించారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి భాజపా కారణమని మండిపడ్డారు గహ్లోత్​. అయితే కాంగ్రెస్​లోని పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఇదంతా ఆ పార్టీ​ వైఫల్యమేనని భాజపా తేల్చిచెప్పింది.

Currently we are not demanding floor test: Rajasthan BJP president Satish Poonia
'భాజపా కుట్రలకు నిదర్శనం రాజస్థాన్​ సంక్షోభం'
author img

By

Published : Jul 14, 2020, 5:13 PM IST

రాజస్థాన్​ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. రెబల్​ నేత సచిన్​ పైలట్​పై కాంగ్రెస్​ వేటు వేయడం వల్ల రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సచిన్​ను పార్టీ పదవుల నుంచి తప్పించిన కొద్ది సేపటికే.. గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రాతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. సచిన్​ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదించారు గహ్లోత్​. ఈ ప్రతిపాదనను గవర్నర్​ వెంటనే ఆమోదించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన గహ్లోత్​.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచిన్​.. భాజపా చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. మధ్యప్రదేశ్​లో ప్రభుత్వాన్ని కూల్చిన విధంగానే రాజస్థాన్​లోనూ భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు.

"నిజానికి పైలట్​ చేతిలో కూడా ఏమీ లేదు. ఇదంతా భాజపా పన్నిన కుట్ర. పైలట్​ భాజపా చేతుల్లోకి వెళ్లిపోయారు. రిసార్టులను ఏర్పాటు చేసింది భాజపానే. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది."

--- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

సచిన్​ పైలట్​తో పాటు ఆయన అనుచరులకు కాంగ్రెస్​ అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు గహ్లోత్​. అయినప్పటికీ పైలట్​ రెబల్​గా మారడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

సచిన్​తో పాటు ఆయన మద్దతుదారులు విశ్వేంద్ర సింగ్​, రమేశ్​ మీనాను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది కాంగ్రెస్​.

'అవన్నీ తప్పుడు ఆరోపణలు...'

రాజస్థాన్​ సంక్షోభం వెనక తమ హస్తం ఉందన్న కాంగ్రెస్​ ఆరోపణలను భాజపా ఖండించింది. పార్టీ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భాజపా రాజస్థాన్​ ఇన్​ఛార్జ్​ అవినాశ్​ రాయ్​ ఖన్నా స్పష్టం చేశారు.

భాజపా వ్యూహమేంటి?

ఈ వ్యవహారంపై భాజపా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనపడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించేందుకు జైపుర్​ వేదికగా భాజపా నేతలు సమావేశమయ్యారు.

అయితే ప్రస్తుతానికి బలపరీక్ష డిమాండ్​ చేయడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్​ పూనియా వెల్లడించారు.

"ప్రస్తుతానికి మేము బలపరీక్ష జరపాలని డిమాండ్​ చేయడం లేదు. ఇదొక అవినీతి ప్రభుత్వం. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనడంలోనూ విఫలమైంది. ప్రభుత్వం బలహీనపడింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ ప్రభుత్వం తప్పుకోవాలి."

--- సతీశ్​ పూనియా, భాజపా రాజస్థాన్​ అధ్యక్షుడు.

తమ నేతలందరూ ఐకమత్యంతో ఉంటారని కాంగ్రెస్​ ఎప్పుడూ చెబుతుందని.. అయితే పైలట్​ వ్యవహారంతో అది ఎంత నిజమో అందరికీ తెలిసిందని ఎద్దేవా చేశారు పూనియా.

తనను పార్టీ నుంచి తప్పించడంపై సచిన్​ పైలట్​ స్పందించారు. నిజాన్ని ఓడించలేరంటూ ట్వీట్​ చేశారు. ఈ నేపథ్యంలో పైలట్​ తదుపరి కార్యాచరణ ఏంటి? భాజపాలో చేరతారా? లేదా? అన్న విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చూడండి:- గహ్లోత్​ నాయకత్వానికే​ మా పూర్తి మద్దతు: సీఎల్​పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.