అర్రే.. ఈ చిత్రంలోని ఆయనను ఎక్కడో చూసినట్టు ఉంది కదూ.. రాజసంగా పరుగులు తీసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధడక్.. ధడక్ మంటూ నడిపిస్తున్న ఈయన పేరు పెమా ఖండూ.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటక రంగానికి ప్రోత్సాహం కల్పించి.. అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నారు. ఇందుకోసం ఆయనే బైక్‌పై ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో తన ప్రయాణానికి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకున్నారు.
-
Video of #motorcycle #RoadTrip from Yinkiong to Pasighat
— Pema Khandu (@PemaKhanduBJP) October 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
An attempt towards promoting #Arunachal as dream destination for #biking and #adventure sports! @YASMinistry @ArunachalTsm @tourismgoi @lonelyplanet_in @incredibleindia @KirenRijiju pic.twitter.com/Om6ZxGPZNO
">Video of #motorcycle #RoadTrip from Yinkiong to Pasighat
— Pema Khandu (@PemaKhanduBJP) October 14, 2019
An attempt towards promoting #Arunachal as dream destination for #biking and #adventure sports! @YASMinistry @ArunachalTsm @tourismgoi @lonelyplanet_in @incredibleindia @KirenRijiju pic.twitter.com/Om6ZxGPZNOVideo of #motorcycle #RoadTrip from Yinkiong to Pasighat
— Pema Khandu (@PemaKhanduBJP) October 14, 2019
An attempt towards promoting #Arunachal as dream destination for #biking and #adventure sports! @YASMinistry @ArunachalTsm @tourismgoi @lonelyplanet_in @incredibleindia @KirenRijiju pic.twitter.com/Om6ZxGPZNO
తమ రాష్ట్రంలో బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందిన యుంకియాంగ్ నుంచి పాసిఘాట్ వరకు బైక్‌ను పరుగులు పెట్టించారు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 122 కిలోమీటర్లు బైక్‌పై ఒంటరిగా ప్రయాణించారు. తన బైక్ ప్రయాణానికి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తూ.. పర్యటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయాణం అని వ్యాఖ్య రాశారు. తాను ప్రయాణించిన మార్గాన్ని పరిచయం చేస్తూ బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ఇది మంచి ప్రదేశం అని పేర్కొన్నారు.
తన ప్రయాణాన్ని అక్టోబర్ 13న ఉదయం 8 గంటలకు యుంకియాంగ్ నుంచి ప్రారంభించగా, పాసిఘాట్ విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నానని చెప్పారు.
పెమాఖండూ ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుసార్లు బైక్ రైడ్ చేస్తూ కనిపించారు ఖండూ. గతేడాది బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు సైకిల్ తొక్కారు. పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు సామాజిక మాధ్యమాలను ఆయన బాగా ఉపయోగిస్తుంటారు.
-
Motorcycle #RoadTrip today from Yingkiong to Pasighat.
— Pema Khandu (@PemaKhanduBJP) October 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The 122km route offers best road conditions and picturesque views. Now is the best time for bikers in Arunachal. #Arunachal #AmazingArunachal #VisitArunachal #Siang pic.twitter.com/gwksAdTNTa
">Motorcycle #RoadTrip today from Yingkiong to Pasighat.
— Pema Khandu (@PemaKhanduBJP) October 13, 2019
The 122km route offers best road conditions and picturesque views. Now is the best time for bikers in Arunachal. #Arunachal #AmazingArunachal #VisitArunachal #Siang pic.twitter.com/gwksAdTNTaMotorcycle #RoadTrip today from Yingkiong to Pasighat.
— Pema Khandu (@PemaKhanduBJP) October 13, 2019
The 122km route offers best road conditions and picturesque views. Now is the best time for bikers in Arunachal. #Arunachal #AmazingArunachal #VisitArunachal #Siang pic.twitter.com/gwksAdTNTa
ఇదీ చూడండి: ‘చైనాతో ఆరోగ్యకర సంబంధాలు అవసరం’