భాజపా సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఇవాళ మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. గుండెకు సంబంధించిన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.
ఆరోగ్య బులెటిన్
జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. జైట్లీని ఐసీయూలో ఉంచామని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు.
ఎయిమ్స్‌కు చేరుకున్న నేతలు
జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న భాజపా నాయకులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా జైట్లీ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఎయిమ్స్ చేరుకున్నారు.
కొన్నాళ్లుగా జైట్లీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది మేలో ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. గతంలో ఆయనకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స జరిగింది.