ETV Bharat / bharat

కశ్మీర్​: మహిళల నిరసన బాట.. ఫరూక్​ కుమార్తె అరెస్ట్​ - కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా సోదరి, కుమార్తె అరెస్టు

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కొంతమంది మహిళలు శ్రీనగర్​లో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆందోళనలకు నాయకత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య, కుమార్తె సఫియా ఉన్నారు.

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ కశ్మీరీ మహిళల నిరసనలు
author img

By

Published : Oct 15, 2019, 6:01 PM IST

Updated : Oct 15, 2019, 6:45 PM IST

కశ్మీర్​: మహిళల నిరసన బాట.. ఫరూక్​ కుమార్తె అరెస్ట్​

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య, కుమార్తె సఫియా నాయకత్వంలో కశ్మీరీ మహిళలు ఆందోళన చేపట్టారు. శ్రీనగర్​ లాల్​చౌక్ సమీపంలోని ప్రతాప్​ ఉద్యానవనం వద్ద నల్ల బ్యాడ్జ్​లు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్​ 35 ఏ ను రద్దుచేయడం, జమ్ము కశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ ప్రజలను మోసగించి, అవమానించారని ఆరోపించారు.

నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మోహరించిన బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. కశ్మీర్​లోని వాస్తవ పరిస్థితులను వక్రీకరిస్తున్నారంటూ జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన విరమించి, శాంతియుతంగా వెళ్లిపోవాలని సూచించారు. అందుకువారు నిరాకరించారు. నిరసనకు పోలీసుల అనుమతి లేనందున..ఆందోళన చేస్తున్న సురయ్య, సఫియా సహా ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధం ముగింపు ఆశలతో రెండో రోజూ జోరు

Manesar (Haryana), Oct 15 (ANI): National Security Guard (NSG) celebrated its Foundation Day at Manesar in Haryana on October 15. Union Home Minister Amit Shah attended the celebrations. Security forces exhibited jaw-dropping actions. The enactment of warfare left all the audience in awe. NSG is celebrating 35th Foundation Day this year.

Last Updated : Oct 15, 2019, 6:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.