ఆర్టికల్ 370తో కశ్మీర్ వాసులకు ఇప్పటివరకు జరిగింది ఏంలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని విశ్వసించినట్టు తెలిపారు. తమిళనాడులో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రచించిన పుస్తక ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఆర్టికల్ 370ని రద్దు చేయాలా వద్దా అని ఒక చట్టసభ్యుడిగా నా మనసులో కొంచెం కూడా సందేహం లేదు. ఆర్టికల్ 370తో దేశానికి, కశ్మీర్‌కు మంచి జరగలేదని నేను విశ్వసిస్తున్నా. ఎప్పుడో దాన్ని తొలగించాల్సి ఉంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏం జరుగుతుందనే సందేహమూ నాకు లేదు. కశ్మీర్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుంది. రాష్ట్రాభివృద్ధిలో కశ్మీర్ ముందడుగు వేస్తుందని నేను నమ్ముతున్నా."
--- అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి.
ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ ఇటీవలే ఆమోద ముద్రవేసింది.
ఇదీ చూడండి:- 15 కిలోమీటర్ల జాతీయ జెండాతో మానవహారం