పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి చేయడానికి ముందు మన సైన్యాధిపతి బిపిన్ రావత్ కేంద్రం ముందు ఓ ప్రతిపాదన ఉంచారట. ఉన్నతస్థాయి సైనిక వర్గాల సమాచారం మేరకు.. సర్కారు అనుమతిస్తే పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి ప్రత్యక్ష యుద్ధం చేస్తామని రావత్ కోరారట.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాక్‌ను తగు రీతిలో శిక్షించేందుకు వైమానిక దాడులు సహా పలు మార్గాలను ప్రభుత్వం అన్వేషించింది.
ఆ సమయంలో రావత్ తన బలగం సన్నద్ధత గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారు. పదవీ విరమణ పొందుతున్న పలువురు సైనికాధికారులతో సోమవారం రహస్యంగా సమావేశమైనప్పుడు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. పాకిస్థాన్‌తో సంప్రదాయ పద్ధతిలో భూతల యుద్ధానికి సిద్ధమని రావత్ నాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి: ట్రంప్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?