సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బుధవారం రాత్రి నుంచి సరిహద్దుల్లో పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని నౌషెరా, బాలాకోట్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి గ్రామాలు, సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్లను ప్రయోగించారు.
ఈ ఘటనలో భారత జవాను మృతి చెందాడు. ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు కూడా మృతి చెందాయి. పాక్ సైన్యం కాల్పులను మన భద్రతాదళాలు తిప్పికొడుతున్నాయి.
కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో నక్కి ఉన్న ఉగ్రవాదులను భారత సైన్యం హతమారుస్తుండగా పాక్ సైన్యం తాజాగా కాల్పులకు తెగబడడం ఉద్రిక్తతలను పెంచుతోంది.
బుద్గాంలో ఎన్కౌంటర్..
జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలోని పఠాన్పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రత బలగాలు. ఈ నేపథ్యంలో జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రత దళాలు.
ఇదీ చూడండి: అవును చైనా ఆక్రమించింది: లద్దాక్ ఎంపీ