తమిళనాడు పలోరంలోని మిలటరీ క్వార్టర్స్‌లో ఘోరం జరిగింది. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడనే కోపంతో ఓ సైనిక ఉన్నతాధికారిని.. కిందిస్థాయి ఉద్యోగి కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకున్నాడు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు రైఫిల్మాన్ జగదీశ్వర్‌పై.. హవాల్దార్ ప్రవీణ్‌కుమార్ జోషి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీనిని అవమానంగా భావించిన జగదీశ్వర్ మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్బీఐ నుంచి సర్కారు డబ్బు దొంగతనం'