పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో గాయపడిన ఆర్మీ జవాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించారు.
భద్రతాదళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్ చేస్తున్న దురాగతాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని సైన్యం హెచ్చరించింది.
ఇదీ చూడండి: రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నిరాకరణ