ETV Bharat / bharat

పాక్ కాల్పుల్లో ఓ భారత జవాను మృతి - Pak firing along LoC

జమ్ముకశ్మీర్​ పూంఛ్​​ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. కృష్ణఘాటి, మన్​కోటే సెక్టార్లలో బుధవారం రాత్రి పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పాక్ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు.

Army jawan killed, another injured in Pak firing along LoC in J&K's Poonch
పాక్ కాల్పుల్లో జవాను మృతి- మరొకరికి గాయాలు
author img

By

Published : Oct 1, 2020, 9:42 AM IST

Updated : Oct 1, 2020, 9:58 AM IST

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​​ జిల్లాలో నియంత్రరేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్లింగులతో పాక్ సైన్యం కాల్పులు చేసినట్లు ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. కృష్ణఘాటి, మన్​కోటే సెక్టార్లలో బుధవారం రాత్రి కాల్పులు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.

"సెప్టెంబర్ 30 రాత్రి పూంఛ్​ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్​లో ప్రాణత్యాగం చేసిన లాన్స్ నాయక్ కర్నయిల్​ సింగ్, అతని కుటుంబానికి వైట్ నైట్ కార్ప్స్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్ సహా అన్ని ర్యాంకుల అధికారులు సంతాపం ప్రకటించారు."

-భారత ఆర్మీ ప్రతినిధి

సెప్టెంబర్ నెలలో పాకిస్థాన్ సైన్యం 47 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్​ జిల్లాలోని గ్రామాలే లక్ష్యంగా గత ఐదు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. మోర్టార్ షెల్లింగుతో పాక్ చేసిన దాడిలో కొన్ని మూగజీవాలకు గాయాలయ్యాయి.

Last Updated : Oct 1, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.