శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారి-29ఆర్ఆర్ పై భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించింది భారత సైనిక దళం. అనంతరం బాంబు వినాశక దళం ఆ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసింది.
పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న కాసేపటికే.. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. పూంచ్ జిల్లా, కృష్ణ ఘాటి సెక్టార్ లో ఫిరంగులు, తుపాకులతో అప్రకటిత కాల్పులకు తెగబడింది.
గత నెల రోజులుగా నియంత్రణ రేఖ వెంటననున్న గ్రామాలే లక్ష్యంగా రోజుకు ఒకటి, రెండు సార్లు కాల్పులు జరుపుతోంది పాక్. ఆగస్ట్ 1న జమ్ము కశ్మీర్ రాజౌరి జిల్లాలో పాక్ ఆకస్మిక కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను రోహిన్ కుమార్ మృతిచెందాడు. అదే జిల్లాలో జులై 10న మరో జవాను కన్ను మూశాడు. జులై 18న పూంచ్ జిల్లాలో పాక్ వక్రబుద్ధికి ముగ్గురు అమాయక పౌరులు బలయ్యారు.
ఇదీ చదవండి: ముంబయిని ముంచెత్తిన వాన.. నీటమునిగిన నగరం