ETV Bharat / bharat

ఆరోసారి భారత్-చైనా సైనిక కమాండర్లు భేటీ - The sixth round of Corps commander-level talks

సరిహద్దులో భారత్-చైనా ఆర్మీ కమాండర్ల మధ్య ఆరోవిడత చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు.. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలు చేయాలని ఇరు సైనికాధికారులు చర్చించారు. భారత్ తరఫున తొలిసారి విదేశాంగ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు.

Army commanders of India, China hold 6th round of talks on border standoff
భారత్-చైనా మధ్య ఆరోదఫా కమాండర్ స్థాయి చర్చలు
author img

By

Published : Sep 21, 2020, 3:55 PM IST

సరిహద్దులో సైనిక ప్రతిష్టంభనపై భారత్-చైనా సీనియర్ ఆర్మీ కమాండర్ల మధ్య ఆరో విడత చర్చలు జరిగాయి. ఉద్రిక్తతలు తగ్గించుకునేలా ఇరుదేశాల మధ్య కుదిరిన అయిదు సూత్రాల ఒప్పందాన్ని అమలు చేయడంపై సైనికాధికారులు చర్చించారు.

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వైపు ఉన్న మోల్దోలో ఉదయం 9 గంటలకు కార్ప్స్ కమాండర్ భేటీ జరిగినట్లు భారత సైన్యం తెలిపింది. సమావేశం ఇంకా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.

భారత్​ తరపున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో భాగంగా ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు.. నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయించడమే ఈ చర్చల ప్రధాన అజెండా అని అధికారులు తెలిపారు.

విదేశాంగ శాఖ తొలిసారి

ఈ సమావేశంలో విదేశాంగ శాఖ నుంచి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పాల్గొన్నారు. సరిహద్దులో జరుగుతున్న అత్యున్నత సైనిక చర్చల్లో విదేశాంగ శాఖ పాల్గొనడం ఇదే తొలిసారి. మరోవైపు లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ సైతం చర్చలకు హాజరయ్యారు. ఆయన.. వచ్చే నెలలో 14 కార్ప్స్​కు కమాండర్​గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. దక్షిణ షింజియాంగ్ కమాండర్.. మేజర్ జనరల్ లియు లిన్ చైనా నుంచి చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి-

పంచతంత్రంతో శాంతి మంత్రం! ఐదు సూత్రాలివే..

మరోసారి కమాండర్​ స్థాయి చర్చలు

చర్చల బాధ్యత రెండు దేశాలపై ఉంది: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.