సైనికాధిపతి నరవాణె రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. లద్దాఖ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రెండు రోజులపాటు తూర్పు లద్దాఖ్, వాస్తవాధీన రేఖ సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించారు సైనికాధ్యక్షుడు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సైనిక సన్నద్ధత, సరిహద్దు వెంట భారత బలాన్ని పెంచే అంశాలపై రాజ్‌నాథ్‌కు నివేదించినట్లు తెలుస్తోంది.
లేహ్‌లో యుద్ధ విమానాలు..
జూన్ 15,16 తేదిల్లో జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత్. క్రమంగా బలగాల సంఖ్యను పెంచుతోంది.
-
#WATCH Ladakh: Indian Air Force aircraft carrying out sorties in Leh. The air activity has gone up in the region after the stand-off with China on the Line of Actual Control (LAC) there. pic.twitter.com/6L0Bqn3hTY
— ANI (@ANI) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Ladakh: Indian Air Force aircraft carrying out sorties in Leh. The air activity has gone up in the region after the stand-off with China on the Line of Actual Control (LAC) there. pic.twitter.com/6L0Bqn3hTY
— ANI (@ANI) June 26, 2020#WATCH Ladakh: Indian Air Force aircraft carrying out sorties in Leh. The air activity has gone up in the region after the stand-off with China on the Line of Actual Control (LAC) there. pic.twitter.com/6L0Bqn3hTY
— ANI (@ANI) June 26, 2020
భారత వాయుసేన విమానాలు ఇప్పటికే లేహ్ ప్రాంతానికి చేరాయి. గగనతలంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహిస్తున్నాయి.
నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలు..
పొరుగుదేశం నేపాల్.. కొద్దిరోజులుగా సరిహద్దులో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్- నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలను తరలించింది సైన్యం. ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్ జిల్లా దర్చులా నుంచి కాలాపానీ వరకు సశస్త్ర సీమాబల్‌కు చెందిన జవాన్లను మోహరించింది. నేపాల్‌తో సరిహద్దును మూసేసింది.
భారత భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని విడుదల చేయడం.. దర్చులాకు సమీపంలో రహదారి నిర్మాణం, భారత భూభాగమైన మాల్పాలో హెలీప్యాడ్ ఏర్పాటు వంటి చర్యలతో భారత్- నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే