భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వచ్చే నెల నేపాల్‌లో పర్యటించనున్నారు. అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నట్లు సైన్యాధికారులు ప్రకటించారు. రక్షణ మంత్రి ఈశ్వర్ పోఖ్రెల్, నేపాల్ ఆర్మీ చీఫ్ పూర్ణ చంద్ర థాపాతోనూ భేటీ కానున్నారు.
భారత భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ కొత్త మ్యాప్‌ను నేపాల్ ఆమోదించిన తర్వాత.. ఆ దేశానికి నరవాణే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లోని కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ భూభాగాలను నేపాల్‌కు చెందినవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంటు ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. నేపాల్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి కృత్రిమ ప్రాదేశిక విస్తరణలను ఆమోదించబోమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఆ దేశంలో పర్యటించబోతున్నారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో జనరల్ నరవాణేకు ‘జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు.
ఇవీ చూడండి: భారత్‌పై నేపాల్‌కు ఎందుకంత అక్కసు?