ETV Bharat / bharat

రావత్​ 'నాయకత్వ' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం - దేశంలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై సైన్యాధికారి రావత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి

దేశంలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై సైన్యాధికారి రావత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. రాజకీయ సమస్యలపై రావత్​​ జోక్యం చేసుకోవడం సరికాదంటూ పలువురు రాజకీయ నేతలు ట్విటర్​ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.

army chief
రావత్​ 'నాయకత్వ' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
author img

By

Published : Dec 26, 2019, 7:48 PM IST

'పౌర' నిరసనలపై సైన్యాధిపతి బిపిన్​ రావత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయాలపై భారత సైన్యాధిపతి వ్యాఖ్యానించడం సరికాదని కాంగ్రెస్​ సహా అనేక విపక్ష పార్టీలు మండిపడ్డాయి.

మారణహోమాలకు తమ అనుచరులను రెచ్చగొట్టడమూ నాయకత్వ లక్షణాలు కాదని దిగ్విజయ్​ సింగ్​ ఎద్దేవా చేశారు.

‘"బిపిన్​ రావత్.. నేను మీతో ఏకీభవిస్తున్నాను. అయితే మత కల్లోలాలు, మారణహోమాలకు తమ అనుచరులను రెచ్చగొట్టే వాళ్లు కూడా నాయకులు కాదు. మరి మీరు కూడా నాతో ఏకీభవిస్తారా జనరల్ సాహెబ్?"

-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత.

అంతకుముందు.. ప్రజలు, విద్యార్థులను హింసకు ఉసిగొల్పడం నాయకత్వం కాదని భారత సైన్యాధిపతి బిపిన్​ రావత్​ ఉద్ఘాటించారు. నిజమైన నాయకుడు ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తాడని వ్యాఖ్యనించారు. దిల్లీ పౌర అలర్ల నేపథ్యంలో రావత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

సైన్యాధిపతి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని మరో కాంగ్రెస్​ నేత బ్రిజేశ్​ కాలప్ప ఆరోపించారు.

"పౌర నిరసనలకు వ్యతిరేకంగా సైన్యాధిపతి మాట్లాడటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు రాజకీయ సమస్యలపై మాట్లాడటానికి సైన్యాధికారికి అవకాశమిస్తే, రేపు ఏకంగా సైన్యాన్నే స్వాధీనం చేసుకునే అవకాశముంది."

-బ్రిజేశ్​​ కాలప్ప, కాంగ్రెస్​ ప్రతినిధి.

మోదీ ప్రభుత్వ విధానాలను రావత్​ వ్యాఖ్యలు బలహీనం చేస్తున్నాయని ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ తెలిపారు.

"బిపిన్​ రావత్​ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల్ని బలహీనం చేస్తున్నాయని తెలుస్తోంది. అత్యయిక పరిస్థితి సమయంలో దేశంలో చెలరేగిన నిరసనల్లో మోదీ పాల్గొన్నారని.. ఆ విషయాన్ని స్వయంగా మోదీనే అంగీకరించారు. ఇప్పుడు సైన్యాధిపతి వ్యాఖ్యల ప్రకారం మోదీ చేసింది కూడా తప్పేకదా."

-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం చీఫ్.

రావత్​ రాజకీయాలపై వ్యాఖ్యనించడం తగదని.. దేశానికి ఆయన క్షమాపణలు తెలపాలని సీపీఐ(ఎమ్​) డిమాండ్​ చేసింది.

"మోదీ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా క్షీణించిందో బిపిన్​ రావత్​ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఉన్నతాధికారై తన సంస్థాగత పరిమితులను ఉల్లంఘించారు. పాకిస్థాన్​ సైన్యం ఆధిపత్యంలో ఆ దేశ రాజకీయం నడుస్తోంది. బహుశా మనం అదే దారిలో వెళ్తున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాస్వామ్య పోరాటాల్లో ఓ సైన్యాధికారి జోక్యం చేసుకోవడం భారత్​ చరిత్రలో ఇప్పటిదాకా చూడలేదు. రావత్​ క్షమాపణలు చెప్పాలి."

-సీపీఐ(ఎమ్​).

ఇదీ చూడండి : 'ప్రజలను హింసకు ఉసిగొల్పడం నాయకత్వం కాదు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.