ETV Bharat / bharat

ఉగ్రభూతంపై భారత్​, మయన్మార్ ఉమ్మడి పంజా - ఉగ్రస్థావరాలు ధ్వంసం

భారత్​, మయన్మార్​లు 'ఆపరేషన్​ సన్​రైజ్' పేరుతో ఈశాన్య రాష్ట్రాల్లో పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. సుమారు 75 మంది ముష్కరులను అదుపులోకి తీసుకున్నాయి.​

తీవ్రవాదులపై పంజా విసిరిన భారత్​, మయన్మార్ సైన్యాలు
author img

By

Published : Jun 17, 2019, 6:06 AM IST

Updated : Jun 17, 2019, 7:10 AM IST

భారత్​, మయన్మార్​ సైన్యాలు సంయుక్తంగా తమ సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై భారీ ఆపరేషన్​ చేపట్టాయి. మణిపుర్​, నాగాలాండ్​, అసోంలోని ముష్కర స్థావరాలను ధ్వంసం చేశాయి. గత నెల 16 నుంచి మూడు వారాల పాటు ఆపరేషన్ జరిగిందని రక్షణ అధికారులు వెల్లడించారు.

భారత్​-మయన్మార్​ మధ్య 1,645 కి.మీ సరిహద్దు ఉంది. తీవ్రవాదం ఎక్కువగా ఉండే మణిపుర్​, నాగాలాండ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు పంచుకుంటోంది.

ఆపరేషన్​ సన్​రైజ్​-1

ముష్కరుల ఆట కట్టించేందుకు ఇరుదేశాల సైన్యాలు మూడు నెలల కిందట 'ఆపరేషన్​ సన్​రైజ్​' పేరుతో దాడులు నిర్వహించాయి. పలు తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి.

కాలాదాన్​ రవాణా ప్రాజెక్టును వ్యతిరేకించే అరాకన్ ఆర్మీ అనే వేర్పాటువాద ముఠాను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఈ ఆపరేషన్​ చేపట్టింది.

ఆపరేషన్​ సన్​రైజ్​-2

గత నెలలో చేపట్టిన ఆపరేషన్ సన్​రైజ్​-2లో ఇరుదేశాల సైన్యాలు కలిసి కేఎల్​ఓ, ఎన్​ఎస్​సీఎన్ (ఖాప్లాంగ్​), ఉల్ఫా (ఐ), ఎన్​డీఎఫ్​బీ తదితర తీవ్రవాద ముఠాల స్థావరాలను ధ్వంసం చేశాయి. సుమారు 75 మంది మిలిటెంట్లను నిర్బంధంలోకి తీసుకున్నాయి.

క్షేత్రస్థాయి పరిస్థితులు, నిఘా సమాచారం ఆధారంగా మరో విడత ఆపరేషన్​ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: సంక్షోభం: నీళ్లు లేవు... భోజనం పెట్టలేం..!

New Delhi, May 01( ANI) : Actor Ayushmann Khurrana, who recently treated his fans with two blockbusters 'Andhadhun' and 'Badhaai Ho' is back to win millions of hearts with his upcoming film 'Article 15'. The moviegoers will soon get to witness the actor's magic on screen as the film has finally got its release date.The film is scheduled to release on June 28, this year. Indian Trade Analyst Taran Adarsh revealed the release date on his Twitter handle along with a picture of the actor in his character's get up. The investigative drama is directed by Anubhav Sinha and produced by Benaras Media Works. Along with Khurrana, the movie also stars Sayani Gupta, Isha Talwar, Nassar, Mohd Zeeshan Ayyub, Kumud Mishra and Manoj Pahwa in pivotal roles.
Last Updated : Jun 17, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.