బంగాల్లోని ఆసన్సోల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మోసాలకు పాల్పడే వారికి ముఖ్యమంత్రులు సహకరిస్తుంటే, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో అవినీతి, మోసాలు నిరంతరం బంగాల్ను కుదిపేస్తున్నాయని విమర్శించారు.
కుంభకోణాలు చేసిన సొమ్ముతో మమతా బెనర్జీ ప్రధాని పదవిని కొనుగోలు చేయడానికి కలలు కంటున్నారని ఆరోపించారు మోదీ.
"మన దీదీ... ప్రధానమంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. వేలం పాటలో ప్రధాని పదవి లభిస్తే... కాంగ్రెస్ పార్టీ, దీదీ.. దొంగలించిన సొమ్ములను వేలంలో పెడతారు. దీదీ... శారద, నారద కుంభకోణాల సొమ్ముతో కొనగోలు చేయడానికి ఈ ప్రధానమంత్రి పదవి వేలంలో లభించదు. 130 కోట్ల భారతీయలు ఆశీర్వాదాలు ఈ ప్రధాని పదవి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే మమత తనపై ఆరోపణలు, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు మోదీ.
ఇదీ చూడండి: లారీ నిండా బాంబులు- శ్రీలంకలో హైఅలర్ట్