భారత వాయుసేన పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేసిన దాడులకు గల కారణాలను అంతర్జాతీయ సమాజానికి తెలపాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఇటీవలి పాక్-భారత్ పరిణామాలను విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీకి విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వివరించారు.
వాయుదాడుల వల్ల ఉగ్రవాదులకు కలిగిన నష్టానికి సంబంధించిన వివరాలతో పాటు వాటి ప్రభావాన్ని వివిధ దేశాలకు వివరించాలని కోరింది కమిటీ. దీని వల్ల అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను ప్రశ్నించవని కమిటీ అభిప్రాయపడింది.
వివిధ దేశాలతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని విజయ్ గోఖలే కమిటీకి తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్(ఓఐసీ) నుంచి వచ్చిన మద్దతు గురించి వివరించారు. ఇటీవల జరిగిన భారత్ ఓఐసీ సమావేశానికి మొదటిసారిగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గౌరవ అతిథిగా హజరయ్యారు. భారత్ పాల్గొనటాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని పాక్ బహిష్కరించింది.