ఐరోపా సమాఖ్య ఎంపీలు జమ్ముకశ్మీర్‌లో పర్యటించడానికి ఒక్క రోజు ముందు.. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో నారాయణ్‌దత్ అనే వాహన చోదకుడు మృతి చెందాడు. మృతుడు ఉదంపుర్ జిల్లా కాట్రా నివాసి.
అనంత్‌నాగ్‌లోని బిజ్బెహరా ప్రాంతం.. కనిల్వాన్లో నారాయణ దత్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమీపంలోనే ఉన్న పోలీసు అధికారి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నందువల్ల మరో ఇద్దరు చోదకులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఉగ్రవాదుల కోసం ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
ఆర్టికల్ రద్దు అనంతరం ముష్కరమూకలు వాహన చోదకులపై జరిపిన దాడిలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారి, కశ్మీర్లో పనికోసం వచ్చిన మరో వ్యక్తి ముష్కరమూకల దాడికి బలయ్యారు.
ఇదీ చూడండి: ఔదార్యం: 37 ఏళ్లుగా ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!