దిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ద్వారా సోమవారం నుంచి రాకపోకలను నిషేధించారు రైల్వే అధికారులు. ఈ స్టేషన్‌ను కరోనా మహమ్మారి చికిత్సా కేంద్రంగా మార్చారు. దిల్లీలో ఆస్పత్రులు సరిపోని కారణంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసిన ఐసోలేషన్ కోచ్‌లను ఇందులో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆనంద్ విహార్ నుంచి నడవనున్న ఐదు రైళ్లు సోమవారం నుంచి పాత దిల్లీ స్టేషన్ నుంచి నడవనున్నాయి.
దిల్లీలో వైరస్ వ్యాప్తిపై చర్చించిన హోంమంత్రి అమిత్‌షా 500 ఐసోలేషన్ కోచ్‌లను దేశరాజధానిలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే షాకూర్ బస్తీ స్టేషన్లో 54 కోచ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. మిగతా కోచ్‌లను ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లోని ఏడు ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంచనున్నారు.
కోచ్‌ల్లో వైరస్ బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు రైల్వే సిబ్బంది. ఆక్సిజన్ సిలిండర్లు, దుప్పట్లు, వైద్య పరికరాలు, శానిటైజ్ చేసిన పడకలను సిద్ధం చేశారు. టాయ్లెట్లను.. బాత్రూంలుగా మార్చారు.
ఇదీ చూడండి: జవాన్లకు జంటగా ఫిట్నెస్ కోర్సులు