ETV Bharat / bharat

అమ్మకు అనంతమైన ప్రేమ పంచినందుకు కారు గిఫ్ట్ - Anand Mahindra gifted a car to a son who travelled all over the world with mom on scooter form karatka

ఊరి పొలిమేర దాటి ఎరుగని తల్లిని.. స్కూటర్ మీదే దేశామంతా తిప్పి చూపించాడు కర్ణాటకకు చెందిన ఆ తనయుడు. కలియుగ శ్రవణ కుమారుడే అంటూ అతడి ప్రేమకు ఏడాది క్రితం యావత్ భారతం ఫిదా అయిపోయింది. ఇప్పుడు యాత్ర పూర్తి చేసుకుని ఇల్లు చేరిన ఆ తల్లి-తనయులకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ కారు బహుమతిగా ఇచ్చారు.

Anand Mahindra gifted a car to a son who travelled all over the world with mom on scooter form karatka
అమ్మకు అనంతమైన ప్రేమ పంచినందుకు కారు గిఫ్ట్!
author img

By

Published : Sep 20, 2020, 12:46 PM IST

వృద్ధాప్యంలో అమ్మకు అనంతమైన ప్రేమను పంచిన కర్ణాటకకు చెందిన తనయుడికి.. కారు బహూకరించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.

కర్ణాటకలోని మైసూర్​ బొగాడికి చెందిన డి. కృష్ణ కుమార్...​ తల్లి చూదరత్నకు దేశంలో అన్ని పుణ్య క్షేత్రాలు తిప్పి చూపించాలనుకున్నాడు. ఉద్యోగం మానేసి.. 20 ఏళ్ల క్రితం నాటి పాత స్కూటర్​పై మాతృసేవా సంకల్ప్​ యాత్ర చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాడు. మాతృమూర్తి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన.. 'ఆ వ్యక్తిని పరిచయం చేస్తే.. కారు గిఫ్ట్​గా ఇస్తా' అని గతేడాది అక్టోబర్​లో ట్విట్టర్ ద్వారా ప్రకటించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.

ఇప్పుడు తీర్థ యాత్రలు పూర్తి చేసుకుని మైసూర్ తిరిగివచ్చిన ఆ తల్లీ-తనయులకు మహీంద్ర కేయూవీ 100 కారును బహూకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్రా.

ఇవీ చదవండి: 'ఆ వ్యక్తిని పరిచయం చేస్తే.. కారు గిఫ్ట్​గా ఇస్తా'

అమ్మకు సాయంగా.. కూతురు బావి తవ్వేయంగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.