ETV Bharat / bharat

గల్వాన్​లో స్కెచ్​ వేస్తే కాలాపానీలో రిజల్ట్​..! - గల్వాన్‌ పాఠమే కాలాపానీలో వెనక్కి తగ్గేందుకు కారణమా?

హిమాలయ పర్వతాల్లో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. లద్దాఖ్​లోని గల్వాన్​ లోయవద్ద నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో పరిస్థితుల్లో మరింత మార్పు కనిపిస్తోంది. అయితే చైనాతో సరిహద్దు వివాద ప్రభావం నేపాల్​ సరిహద్దు ప్రాంతం పిథోర్​గఢ్​ వద్ద కూడా పడినట్లు తెలుస్తోంది. తాజాగా భారత సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​లను తొలగించింది నేపాల్. గల్వాన్ లోయలో భారత్ అనుసరించిన విధానంతో పునరాలోచనలో పడే నేపాల్ చెక్​పోస్ట్​లను తొలగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

nepal
గల్వాన్‌ పాఠమే కాలాపానీలో వెనక్కి తగ్గేందుకు కారణమా?
author img

By

Published : Jul 7, 2020, 2:40 PM IST

Updated : Jul 7, 2020, 2:47 PM IST

భారత హిమాలయ పర్వతసానువుల్లో ఉద్రిక్తతలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయవద్ద నుంచి భారత్‌, చైనా బలగాలు వెనక్కిమళ్లడంతో పరిస్థితి కొంత తేలికపడింది. మరోపక్క భారత్‌-నేపాల్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదంలో మరో సానుకూల పరిణామం చోటు చేసుకొంది. తాజాగా గల్వాన్ పై ప్రకటన వెలువడిన సమయంలో ఈ వార్త బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఏం జరిగింది..?

భారత్‌లోని కాలాపానీ ప్రాంతం తమదే అంటూ నేపాల్‌ దాదాపు నెలరోజుల క్రితం హడావుడి చేసింది. అదే సమయంలో భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లో కొత్తగా ఆరు చెక్‌పోస్టులను ప్రారంభించింది. ఇవన్నీ ఉత్తరాఖండ్‌లోని దర్చులా జిల్లా పిథోర్‌గఢ్‌ వద్ద ఉన్నాయి. వీటిని నేపాలీ సశస్త్ర ప్రహారీ (ఎన్‌ఎస్‌పీ) నిర్వహిస్తోంది. వీటిల్లో రెండు పోస్టులను తొలగించినట్లు నిన్న నేపాల్‌ అధికారులు ప్రకటించారు. దర్చులా జిల్లా మేజిస్ట్రేట్‌ అనిల్‌ కుమార్‌ శుక్లా మాట్లాడతూ.. వీటిపై నేపాల్‌ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. అసలు వీటి ఏర్పాట్లకు పై నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

ఓలీకి సెగ..

తన అధికారం కాపాడుకోవడం కోసం భారత్‌తో వివాదం పెట్టుకొన్న నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీకి సొంతపార్టీ నుంచే సెగతాకుతోంది. ఆయన భవితవ్యం నిర్ణయించడానికి బుధవారం నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ సమావేశం కానుంది. వాస్తవానికి ఈ సమావేశం సోమవారమే జరగాల్సి ఉంది. కానీ, వాయిదాపడింది. ఓలీ భారత్‌ వ్యతిరేక నిర్ణయాలపై నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓలీ ప్రత్యర్థి, మరో కమ్యూనిస్టు నాయకుడు ప్రచండ కూడా పార్టీని ఏకం చేస్తున్నారు.

నిర్వహణ భారమే

భారత్‌ నుంచి ఎటువంటి కవ్వింపు లేకుండానే ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుల నిర్వహణ నేపాల్‌కు తలకు మించిన భారంగా మారింది. ఎత్తైన ప్రదేశాల్లో చెక్‌పోస్టుల నిర్వహణ ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసొచ్చింది. మరో మూడు చెక్‌పోస్టులు కూడా త్వరలో తొలగించే అవకాశం ఉంది.

ఇప్పటికే చైనాకోసం భారత్‌తో నేపాల్ వివాదానికి సిద్ధమైందన్న అంశం అందరికీ అర్థమైంది. అక్కడి కేపీ ఓలీ ప్రభుత్వానికి చైనా మద్దతు ఉంది. కేపీ ఓలీ సర్కారు భారత్‌ వ్యతిరేక చర్యలకు తెరతీసింది. వాస్తవానికి అక్కడి ప్రజలు , రాజకీయ నాయకులకు ఇది ఏమాత్రం ఇష్టంలేదు. భారత్‌-నేపాల్‌ అత్యంత సన్నిహితమైన దేశాలు. ఇక్కడ ప్రభుత్వాల కంటే ప్రజల మధ్య సత్సంబంధాలు ఎక్కువ. నేపాల్‌కు చెందిన గుర్ఖాలు భారత సైన్యంలో ఉండి సేవలు అందిస్తున్నారు. వీరి సంఖ్య దాదాపు 30వేల వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్గత వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేపీ ఓలీ సర్కారు గల్వాన్‌లో పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతుండగానే భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేసింది.

ఇదీ చూడండి: సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

Last Updated : Jul 7, 2020, 2:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.