హరియాణాలో ఘోర ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన యుద్ధ విమానాన్ని పక్షి ఢీ కొని ఓ ఇంజిన్ పనిచేయకుండా పోయింది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దింపాడు.
భారత వైమానిక దళానికి చెందిన 'జాగ్వర్' యుద్ధ విమానానికి ఆకాశంలో పక్షి తగిలి ఇంజిన్ విఫలమైంది. వెంటనే తన చాకచక్యంతో అందులోని ఇంధన ట్యాంకును ఖాళీ చేశారు పైలట్. చిన్న చిన్న బాంబులు, సామగ్రిని కిందకు వదిలేసి విమానాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు. ఇంజిన్ విఫలమైనప్పటికీ అంబాలా ఎయిర్ బేస్‌లో సురక్షితంగా కిందకు దింపారు. ఘటన స్థలానికి చేరిన అధికారులు పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ బేస్ సమీపంలో విమానం నుంచి పడిన చిన్న బాంబులను గుర్తించారు.
ఆకాశం నుంచి చిన్న చిన్న బాంబులు కిందపడడాన్ని చూసి ఎయిర్ బేస్ సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి: బాలాకోట్ దాడుల వ్యూహకర్తకు 'రా' బాధ్యతలు