ETV Bharat / bharat

సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు! - మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం.

కఠోర పరిశ్రమతో తనను తాను మహోన్నతుడిగా చెక్కుకున్న శిల్పి..తన మాటలతో, చేతలతో కోట్ల మందిలో స్ఫూర్తి రగిల్చిన దార్శనికుడు..ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తెలిసిన మహర్షి.. రాజకీయాలకు వెరవని ధీశాలి..  సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు.. అతడే మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం. నేడు కలాం 88వ జయంతి.

సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు!
author img

By

Published : Oct 15, 2019, 6:21 AM IST

నేడు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం 88వ జయంతి. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణ కుటుంబంలో పుట్టి ఇంటింటికీ తిరుగుతూ దిన పత్రికలు వేసిన కలాం.. భారత క్షిపణి సాంకేతికత పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైనం, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన తీరు అనిర్వచనీయం! అడుగడుగునా ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన సాగించిన ప్రయాణం అత్యద్భుతం! సమాజంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే శక్తి యువతకే ఉందని కలాం బలంగా విశ్వసించేవారు.

అందుకే వారిలో స్ఫూర్తి నింపేందుకుగాను తరచూ విద్యాసంస్థలను సందర్శించి ప్రసంగాలు చేసేవారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఓపికతో, చిరునవ్వుతో సమాధానాలిచ్చేవారు. కలాం తన జీవిత కాలంలో చెప్పిన ఎన్నో మాటలు నేటికీ యువతకు ఆదర్శప్రాయమే. ఆచరణీయమే! పలు సందర్భాల్లో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే..

పనిని ప్రేమించండి: మనం నిరంతరం ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే.. మనకు ఇష్టమైన రంగాలను ఎంచుకోవాలనేవారు కలాం. ‘‘చేసే పనిని ప్రేమించాలి. పని ఎప్పుడూ మనకు విసుగు తెప్పించేదిగా ఉండకూడదు’’ అని ఆయన చెప్పేవారు.

‘‘రోజుకు 18 గంటలు పనిచేస్తే మీకు అలుపు రావట్లేదా?’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ‘‘నేను నా పనిని ఆస్వాదిస్తాను. అది నాకు సంతోషాన్నిస్తుంది. నిరంతరం సంతోషంగా ఉన్నప్పుడు విసుగెందుకు వస్తుంది?’’ అంటూ కలాం ఠక్కున సమాధానమిచ్చారు.

జీవితంలో విజయం సాధించాలంటే ప్రధానంగా నాలుగు లక్షణాలు అవసరమంటారు కలాం.

  • స్పష్టమైన లక్ష్యం
  • జ్ఞాన సముపార్జన
  • కఠోర పరిశ్రమ
  • పట్టుదల

'తొలి విజయం తర్వాత విశ్రమించకండి. ఎందుకంటే రెండోసారి మీరు విజయవంతమవ్వకపోతే, మీ తొలి గెలుపు కేవలం అదృష్టవశాత్తూ దక్కిందేనని ప్రచారం చేసేందుకు చాలామంది కాచుకుకూర్చుంటారు.'

'కలలంటే మనకు నిద్రలో వచ్చేవి కావు, మనల్ని నిద్ర పోకుండా చేసేవి.'

ఇదీ చూడండి:'ఆర్థిక మందగమనానికి జీఎస్టీనే కారణం'

AP Video Delivery Log - 2300 GMT News
Monday, 14 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2243: Guinea Protest AP Clients Only 4234802
At least four killed in protests against president
AP-APTN-2237: US WA Indigenous People AP Clients Only 4234801
Indigenous people's day marked with song and dance
AP-APTN-2154: US TX Police Resignation Must credit KDFW; No access Dallas; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4234799
Texas officer named in fatal shooting resigns
AP-APTN-2141: Spain Catalonia Clashes 2 AP Clients Only 4234798
Protesters, police in fierce battles at airport
AP-APTN-2120: UN Syria AP Clients Only 4234797
UN urges maximum restraint over Syria fighting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.