భారత శాస్త్రీయ సంగీతంలో తబలా వాద్యం ప్రత్యేకం. ఈ పరికరం వాయించేందుకు ఎంతో నేర్పు, కృషి అవసరం. అలాంటి తబలాను అలవోకగా వాయిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు కర్ణాటక వాసి చేతన్ కుమార్ హిమదర్. ఆయన తబలా వాయిస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవ్వక తప్పదు.
గిన్నిస్ రికార్డు
ఏటా రాష్ట్రంలో జరిగే హంపి, ధార్వాడ్ వంటి అనేక ఉత్సవాల్లో పాల్గొంటారు చేతన్. మహారాష్ట్రలోని సోలాపుర్లో ఇటీవల జరిగిన తాలా నినాద్ కార్యక్రమంలో.. పలు రకాల ధ్వనులతో ఏకధాటిగా నాలుగు గంటల పాటు తబలా వాయించి చేతన్ గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
పండిట్ రవిశంకర్ వద్ద..
తబలాను వాయించడమే వృత్తిగా ఎంచుకున్న చేతన్.. తొలుత డాక్టర్ అరవింద్ కుమార్ వద్ద శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన రవిశంకర్ గురూజీ ద్వారా తన విద్యకు తుది మెరుగులు దిద్దుకుని మరింత రాటుదేలారు చేతన్. ఈ విద్యను పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నారు చేతన్.
ఇదీ చదవండి: గుడి సమీపంలో 1500 ఏళ్ల నాటి సొరంగం