ETV Bharat / bharat

ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతోనే కరోనాపై విజయం! - భారత్​లో కరోనా కేసులు

దేశంలోని మహానగరాల్లోనే అత్యధికంగా వైరస్​ బాధితులు పెరుగుతున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరింది భారత్​. కాగా నవంబరు మధ్యనాటికి కొవిడ్‌ ఉచ్ఛదశకు చేరుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి అవసరమైన వైద్య సదుపాయాల నిర్మాణానికి, వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోస్థైర్యం పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహం రచించాలి. కరోనాపై వ్యూహాత్మక పోరే విజయాన్ని సాధిస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

An analysis story on Coronavirus outbreak in India
ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతోనే కరోనాపై విజయం!
author img

By

Published : Jun 15, 2020, 6:46 AM IST

ఎన్నో యుద్ధాల పెట్టుగా సర్వానర్థ కారకమవుతున్న కరోనా దేశీయంగా మహానగరాలపై కర్కశంగా కోరచాస్తోంది. వైద్య ఆరోగ్య సేవారంగంలో మూడొంతులు కేంద్రీకృతమైన మహానగరాలే కొవిడ్‌ కేసుల ఉరవడికి కుదేలైపోతున్న దురవస్థ గుండెల్ని పిండేస్తోంది. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి భయావహంగా, దయనీయంగా ఉందన్న సుప్రీంకోర్టు- దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార సరళిని సూటిగా తప్పుపట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మూడు లక్షల 30 వేలు దాటగా అందులో దాదాపు మూడోవంతు వాటా మహారాష్ట్రదే. ఇండియాలో కొవిడ్‌ కేసులు మూడు లక్షలకు చేరడానికి నాలుగున్నర నెలలు పట్టిందని, రోగుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలావధి వారం నుంచి పదిహేను రోజులకు విస్తరించిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) గణాంకాలు వల్లెవేస్తున్నాయి.

నెలాఖరుకు 5 లక్షలకు పైనే

క్షేత్రస్థాయిలో అనేక లొసుగులు అభాగ్య రోగుల్ని కుంగదీసేవే! కరోనా పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే వచ్చే నెలాఖరుకు దేశరాజధానిలోనే కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరి 80వేల ఆసుపత్రి పడకలు అవసరమవుతాయని కేజ్రీవాల్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 'సుప్రీం' తలంటు నేపథ్యంలో కేంద్ర హోం, ఆరోగ్య శాఖ మంత్రులతో కేజ్రీవాల్‌ భేటీ- కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకు తక్షణ సాంత్వన కలిగించే నిర్ణయాల్ని వెలువరించింది.

కొవిడ్‌ రోగులకు స్వస్థత కూర్చే సౌకర్యాలతో ఎనిమిది వేల పడకలుగా అభివృద్ధి చేసిన 500 రైలు పెట్టెలను కేటాయించడం, కరోనా పరీక్షల్ని ఆరు రోజుల్లో మూడింతలు చెయ్యడం, దిల్లీలోగల 219 కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య సర్వే సత్వరం చేపట్టడం వంటి మేలిమి నిర్ణయాలు- కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పోరాట స్ఫూర్తికి ఆనవాళ్లు. వచ్చే 80 రోజుల్లో దేశవ్యాప్తంగా కేసులు పాతిక లక్షలకు చేరతాయంటున్న అంచనాల దృష్ట్యా- రాష్ట్రాలకు కేంద్రం ఇతోధిక తోడ్పాటు, మార్గదర్శకత్వం తప్పనిసరి!

పరిస్థితి చేయి దాటిపోతుంది!

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఎప్పటికి వెలుగు చూస్తుందోగాని, ఆ వైరస్‌ గాలి ద్వారానూ వ్యాపిస్తుందని, 40-45 శాతం మందికి రోగ లక్షణాలు కనబడకుండా సోకి మృత్యు ఘంటికలు మోగిస్తుందనీ తాజా అధ్యయనాలు చాటుతున్నాయి. పదిరోజులుగా గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, వదోదర, సోలాపూర్‌ వంటి పదిహేను నగరాలపై విష పంజా విసరుతున్న కరోనా నియంత్రణ- ఒక్క ముక్కలో రాష్ట్రాల చేయిదాటిపోతోంది. ఇప్పటికే కేసుల రీత్యా ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిన ఇండియా, తీవ్రంగా అస్వస్థులైనవారి సంఖ్యాపరంగా అమెరికా తరవాత రెండో స్థానంలో నిలుస్తోంది. ముంబయిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు 99శాతం నిండిపోయాయని, ఇప్పటికే 94శాతం వెంటిలేటర్లు వినియోగిస్తున్నారన్న గణాంకాలు- మునుముందు కేసులు పెరిగితే పరిస్థితి ఏమిటన్న భయసందేహాల్నే పెంచుతున్నాయి.

వ్యూహం రచించాలి!

సుమారు లక్షన్నర రోగనిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని ఇండియా సముపార్జించినా, విస్తృత పరీక్షల ద్వారా కరోనా కట్టడి వ్యూహ సాఫల్యానికి అది ఏమాత్రం సరిపోదు. వచ్చే నెలాఖరుకల్లా ఐసీయూ పడకలూ సరిపోవన్న అంచనాల దృష్ట్యా- తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణాన్ని కేంద్రం పరిశీలిస్తోందిప్పుడు! నవంబరు మధ్యనాటికి కొవిడ్‌ ఉచ్ఛదశకు చేరుతుందంటున్నారు కాబట్టి- అవసరమైన వైద్య సదుపాయాల నిర్మాణానికి, వైద్యులు ఆరోగ్య సిబ్బంది మనోస్థైర్యం పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహం రచించాలి. స్వీయ రక్షణ చర్యలతోపాటు భౌతిక దూరం పాటించేలా పౌరుల్ని అప్రమత్తం చేస్తూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వైద్య సేవలు సూచనలు అందుబాటులోకి వచ్చేలా చూడటమూ ప్రభుత్వాల విధి. పార్టీ విభేదాలకు అతీతంగా ప్రభుత్వాలు సాగించే వ్యూహాత్మక పోరే కరోనాపై విజయాన్ని అనుశాసిస్తుంది!

ఇదీ చూడండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.