భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్- 32 విమానం అదృశ్యమైంది. మధ్యాహ్నం 12:25 గంటలకు అసోంలోని జోహ్రాత్ ఎయిర్‌బేస్ నుంచి బయలు దేరింది విమానం. చివరిగా ఒంటి గంట సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెన్చూకా గగనతలం వద్ద సంబంధాలు తెగిపోయాయి.
విమానంలో మొత్తం 8 మంది సిబ్బంది సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ఏఎన్-32 విమానం ఆచూకీ కనుగొనేందుకు అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుఖోయ్- 30, సీ- 130 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి.
పరిస్థితిని రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.