అమేఠీ ప్రజలు మాకేం చేశారని ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వయనాడ్‌కు వెళ్లారని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. రాహుల్... దేశంలో ఎక్కడికెళ్లినా ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. దేశ రక్షణను పణంగా పెట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.
" రాహుల్ గాంధీ అమేఠీ వదిలి కేరళకు వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారో మీకందరికీ తెలుసు. ఇక్కడి ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కేరళకు వెళ్లి గెలవాలని చూస్తున్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం... సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబుదాడిలోని పాకిస్థాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు క్లీన్చిట్ ఇచ్చింది. దోషులను విడిచిపెట్టి అమాయకులను జైలుకు పంపి దేశ రక్షణను ప్రమాదంలో పడేసింది."
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్లో ఇక్కడి అన్ని స్థానాల్లోనూ భాజపా విజయకేతనం ఎగురవేసింది.