ETV Bharat / bharat

భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పూర్తి మెజారిటీతో మరోమారు అధికారంలోకి వస్తుందని భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకమే తమను గెలిపిస్తుందని ఈనాడు ముఖాముఖిలో చెప్పారు.

భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'
author img

By

Published : Apr 2, 2019, 8:29 AM IST

ఎన్డీఏ సర్కారు ఐదేళ్లలో చేసిన అభివృద్ధే భాజపా విజయానికి కారణం అవుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్​షా అన్నారు. సార్వత్రిక సమరానికి ముందు ఉన్న రాజకీయ పరిస్థితులపై ఈనాడుతో మాట్లాడారు షా. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

ఈసారీ మేమే వస్తాం...

ఈసారి భాజపా 2014 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. భాగస్వామ్య పక్షాలతో కలిసి మా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం.

నేను ఈశాన్య భారతం నుంచి కన్యాకుమారి వరకు, బిహార్‌ నుంచి గుజరాత్‌ వరకు దేశం మొత్తం తిరిగాను. ఎన్నికలకు ముందే 134 జిల్లాల్లో పర్యటించాను. మరోసారి మోదీని ప్రధానిగా చేయాలన్న ఉత్సాహం ప్రజలందరిలో కనిపిస్తోంది. ప్రజల మనోభావాన్ని బట్టి చూస్తే మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. ఎన్నికల తేదీలు దగ్గరపడే కొద్దీ ఈ గాలి మరింత పెరుగుతుంది.

దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం...

మాది నిర్ణయాత్మక పాలన. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడం. ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థి వ్యవస్థను ఆరో స్థానానికి తీసుకొచ్చాం. 7 కోట్ల మందికి గ్యాస్​, 2.50 కోట్ల మందికి ఇళ్లు, 2 కోట్ల మందికి విద్యుత్​ అందించాం. 50 కోట్ల మంది ఆరోగ్య అవసరాలకయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వమే భరిస్తోంది.

మాది ఉత్తరాది పార్టీ కాదు...

గతంలో కర్ణాటకలో మేము ప్రభుత్వం స్థాపించాం. మాది ఉత్తరాది పార్టీ కాదు. కేరళలో భాజపాకు ఓటుశాతం పెరిగింది. తమిళనాడులో ఉన్న మా ఇంద్రధనస్సు కూటమికి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీకి మద్దతు పెరుగుతోంది.

సీనియర్లను పక్కన పెట్టలేదు...

పార్టీలో 75 ఏళ్లకు పైబడిన వారికి టికెట్లు ఇవ్వలేదు. మాది కుటుంబ పార్టీ కాదు. గతంలో చాలా మంది వారసులకు టికెట్లు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ తండ్రికి ఇవ్వలేదని వారసులకు ఇవ్వాలన్న పద్ధతి మా పార్టీలో ఉండదు. సీనియర్​ నేతలను మేము పక్కన పెట్టలేదు. వారి సేవలను పార్టీ కోసం ఉపయోగించుకుంటాం.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.