కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న 15 రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బంగాల్, అసోం రాష్ట్రాల్లోనూ ర్యాలీలు, రోడ్ షోలకు హాజరవనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
షా పర్యటన ప్రణాళిక..
గుజరాత్- జనవరి 14
కర్ణాటక- జనవరి 16, 17
అసోం- జనవరి 24
పశ్చిమ్ బంగా- జనవరి 30,31
బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్-మే మధ్యకాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షా పర్యటన కీలకంగా మారనుంది.
ఇదీ చదవండి:'భారత-చైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా'