ETV Bharat / bharat

అమిత్​ షా బంగాల్​ పర్యటన వాయిదా - భాజపా అధ్యక్షుడు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా.. బంగాల్​ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ వెల్లడించారు. దిల్లీలో రైతుల ఆందోళనలే కారణంగా తెలుస్తోంది.

Amit Shah defers visit to Bengal
అమిత్​ షా బంగాల్​ పర్యటన వాయిదా
author img

By

Published : Jan 30, 2021, 5:57 AM IST

Updated : Jan 30, 2021, 6:28 AM IST

పశ్చిమ బంగాలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షా పర్యటన రద్దుకు కారణాలేంటో అధికారిక ప్రకటన రాలేదు.

రానున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. భాజపా కీలక నేతలు అక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్​ షా.. రెండు రోజుల పాటు బంగాల్​లో పర్యటించాలనుకున్నారు. జనవరి 30, 31 తేదీల్లో రెండు బహిరంగ సభలకు హాజరుకావాల్సి ఉంది.

భారీగా చేరికలు..

చివరగా డిసెంబర్​ 19-20 తేదీల్లో షా.. బంగాల్​లో పర్యటించిన సమయంలో సువేందు అధికారి సహా పలువురు తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు భాజపాలో చేరారు.

ఏప్రిల్​-మేలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఆరు నెలలకు సరిపడా రేషన్​తో దిల్లీకి రైతులు!

Last Updated : Jan 30, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.