వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌పై చర్యలు తీసుకోవటంలో ఆలస్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యదర్శి జార్గెన్ స్టాక్‌తో సమావేశమయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... జకీర్‌పై రెడ్‌కార్నర్ నోటీసుల జారీపై ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నవారిని శిక్షించాలన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ, అంతర్జాతీయ ఉగ్రవాదం, హవాలా వంటి నేరాలపై దీర్ఘకాలిక ప్రణాళికతో పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు షా. ఇలాంటి వాటిని ఏమాత్రం సహించకూడదనే విధానాన్ని అనుసరిస్తున్నామని జార్గెన్కు తెలిపారు. పరస్పర సహకారంతోనే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదులను పట్టుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
రెడ్‌కార్నర్ నోటీసు అంటే...
రెడ్ కార్నర్ నోటీసును అంతర్జాతీయ అరెస్టు వారెంట్‌గా భావిస్తారు. ఈ నోటీసు జారీ చేయడం ద్వారా... సభ్య దేశాలు ఆయా నేరస్థులను పట్టుకోవాలని కోరుతుంది ఇంటర్‌పోల్.
2022లో ఆతిథ్యం..
2022లో జరగనున్న ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించింది భారత్. 75 స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇంటర్‌పోల్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్లు జనరల్ జార్గెన్తో వెల్లడించారు షా. ఇంటర్‌పోల్ గ్లోబల్ అకాడమీకి ప్రాంతీయ హబ్‌గా మారాలనుకుంటున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన సహకారం, మౌలిక సదుపాయాల కల్పన అందిస్తామని సూచించారు.
ఇదీ చూడండి: దళితుల అభ్యుదయానికి మహాత్ముడు చూపిన బాట