ETV Bharat / bharat

ఆ ఒక్క విద్యార్థిని పరీక్షల కోసం ప్రత్యేక బోటు! - kerala special boat for student

కేరళలో ఓ విద్యార్థిని పరీక్షలు రాయడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా 72 సీట్లున్న బోటును ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి.. సురక్షితంగా తిరిగి ఇంటికి చేర్చారు పడవ సిబ్బంది. ఒక్క విద్యార్థిని కోసం ప్రత్యేక పడవను కేటాయించాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

lockdown boat allocate for 10th class student
ఒక్క విద్యార్థిని పరీక్షల కోసం ప్రత్యేక బోటు!
author img

By

Published : Jun 1, 2020, 6:23 PM IST

Updated : Jun 1, 2020, 8:03 PM IST

పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను కేటాయించడం సహజం. కరోనా కాలంలో అయితే అనేక జాగ్రత్తలు, నిబంధనలతో బస్సులు నడుపుతాయి. కానీ కేరళ మాత్రం.. ఒక విద్యార్థిని కోసం ఏకంగా 72సీట్లున్న పడవను ఏర్పాటు చేసింది. ఆ ఒక్క విద్యార్థిని కోసం అనేక తంటాలు పడింది. ఎవరా విద్యార్థిని? ఎందుకంత ప్రత్యేకం?

ఆ ఒక్క విద్యార్థినికే ఎందుకు?

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. పరీక్షలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. లాక్​డౌన్​లో కేంద్రం అనేక సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయి. వాటిలో కేరళ ఒకటి.

అలప్పుజా జిల్లా కుట్టనాడ్​​ ప్రాంతానికి చెందిన చిన్న ద్వీపంలో 17ఏళ్ల శాండ్రా బాబు అనే విద్యార్థిని నివాసముంటోంది. మే చివరి శుక్ర, శనివారాల్లో కొట్టాయం జిల్లా కంజిరం వద్ద బాలిక ఇంటర్మీడియట్​ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఏకైక మార్గం పడవ ప్రయాణం. అయితే లాక్​డౌన్​ కారణంగా అన్ని బోటు సర్వీసులు నిలిపేసింది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టానికి 1.2 నుంచి 3 కిలో మీటర్ల దిగువన ఉన్న ప్రదేశాల్లో కుట్టనాడ్​ ఒకటి.

శాండ్రా తల్లిదండ్రులు రోజూవారీ కూలీలు. తమ కుమార్తెను పరీక్షలకు ఎలా తీసుకెళ్లాలో తెలియక సతమతమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర జల రవాణా శాఖ(కేఎస్​డబ్ల్యూటీడీ)ను సంప్రదించారు. విద్యార్థిని పరిస్థితి చూసి సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు కేఎస్​డబ్ల్యూటీడీ డైరెక్టర్​ షాజీ వీ నాయర్​ తెలిపారు.

కానీ సమస్యేమిటంటే!

విద్యార్థిని అలప్పుజా నుంచి కొట్టాయం వెళ్లి పరీక్షలు రాయాలి. అయితే బాలికను రోజూ వెళ్లే మార్గంలో కాకుండా వేరే దారిలో తీసుకెళ్లాల్సి వచ్చిందని, విద్యార్థిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ..ప్రస్తుతం ఉన్న మార్గం ఇదొక్కటేనని నాయిర్​ తెలిపారు.

సాధారణంగా విద్యార్థిని ఎంబార్​కేషన్​ కేంద్రం వద్దకు రావడానికి మరో బోటులో రావాలి. అయితే లాక్​డౌన్​ వేళ పడవను విద్యార్థిని ఉన్న ఇంటి సమీప కేంద్రానికి తీసుకెళ్లింది బృందం. సుమారు 5 కి.మీటర్లు నడిచి బోటులో కేంద్రం వద్దకు చేరుకుంది విద్యార్థిని. అలా బాలికను రెండు రోజులపాటు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి.. సురక్షితంగా తిరిగి ఇంటికి చేర్చారు.

'నేను కూడా ఒక కూతురికి తండ్రినే. నా కుమార్తె కూడా పరీక్షలు రాస్తోంది. వారి పరిస్థితిని అర్థం చేసుకోగలను,' అని కేఎస్​డబ్ల్యూటీడీ డైరెక్టర్​ నాయర్​ పేర్కొన్నారు.

అడవుల్లో నుంచి ప్రయాణం..

శ్రీదేవి అనే మరో బాలిక తన 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు.. ఏకంగా 150 కి.మీటర్లు ప్రయాణం చేసింది. గిరిజన ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థిని తిర్సూర్​లో పరీక్షలు రాయడానికి 7 కిలోమీటర్లు నడిచి.. స్కూటర్​, అంబులెన్సు ద్వారా గమ్యస్థానానికి చేరుకుంది. అడవి మధ్యలో ఉన్న ఓ కుగ్రామం నుంచి మరో 10వ తరగతి విద్యార్థి ఒకరు పరీక్షలు రాసేందుకు ప్రయాణించాడు.

ఇదీ చూడండి:- త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

Last Updated : Jun 1, 2020, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.