చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వ సన్నద్ధమవుతోంది. చైనా సైన్యానికి దీటుగా.. అత్యాధునిక ఆయుధాలు, బలగాలను తూర్పు లద్దాఖ్‌కు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తన అమ్ములపొదిలోని అస్త్రాన్ని కూడా సైన్యం బయటకు తీస్తోంది. అదే 'బోఫోర్స్ హావిట్జర్'.
1980 దశకంలో ఈ బోఫోర్స్ హావిట్జర్లు భారత సైన్యంలోకి చేరాయి. చిన్న, మధ్య స్థాయిలో కాల్పులు జరిపే సామర్థ్యం వీటి సొంతం. ప్రస్తుతం వీటికి మరమ్మతులతో పాటు ఇతర ముఖ్యమైన పనులు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఇది జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే వీటిని లద్దాఖ్‌లో మోహరించనున్నారు.
ఇదీ చూడండి:- ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!
ఘన చరిత్ర...
భారత సైన్యంలో బోఫోర్స్‌కు ఘన చరిత్ర ఉంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడంలో బోఫోర్స్ కీలక పాత్ర పోషించింది. శత్రువు చెందిన బంకర్లు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వారు నిర్మించుకున్న శిబిరాలను తునాతునకలు చేసింది బోఫోర్స్. దీంతో పాకిస్థాన్ సైన్యానికి తీరని నష్టం కలిగింది.
ఇవీ చూడండి:-