భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముంబయిలోని నివాస భవనం 'రాజ్గృహ'పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో అంబేడ్కర్ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ దుశ్చర్యను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఖండించారు.
"అంబేడ్కర్ నివాసంపై దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం."
- అనిల్ దేశ్ముఖ్
ఈ దాడిపై స్పందించిన అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్.. రాజ్గృహ వెలుపల ప్రజలెవరూ చేరవద్దని, సంయమనంతో ఉండాలని కోరారు. ఇది చిన్న ఘటన అని, శాంతియుతంగా ఉండాలని మరో మనవడు భీంరావ్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు.