ETV Bharat / bharat

గోవా గవర్నర్​ వద్దకు కాంగ్రెస్​

పారికర్​ మృతితో గోవా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మృదుల సిన్హా​ను 14 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు.

గోవా గవర్నర్​ వద్దకు కాంగ్రెస్​
author img

By

Published : Mar 18, 2019, 2:04 PM IST

ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ మృతితో గోవాలో రాజకీయం ఉత్కంఠగా మారింది. గవర్నర్​ మృదుల సిన్హాను 14 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు.

"మేము గవర్నర్​ను కలిశాము. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్​. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరాం. మా వద్ద 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము మెజారిటీ నిరుపించుకుంటామని గవర్నర్​కు స్పష్టం చేశాం."
---- చంద్రకాంత్​ కావ్లేకర్​, ప్రతిపక్ష నేత

సీఎల్పీ సమావేశంలో నిర్ణయం

సోమవారం ఉదయం పనాజీలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. గవర్నర్​ అపాయింట్​మెంట్​ ఇవ్వనప్పటికీ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజ్​భవన్​కు వెళ్లడానికి నిర్ణయించామని ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్​ కవ్లేకర్​ తెలిపారు. గత శుక్రవారమే గవర్నర్​ సిన్హాకు ప్రభుత్వ ఏర్పాటుపై లేఖ రాసింది ప్రతిపక్ష పార్టీ. ఇదే విషయమై ఆదివారమూ లేఖ రాసింది కాంగ్రెస్​.

అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్​

ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్​ అతిపెద్ద పార్టీగా ఉంది. భాజపాకు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 40 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉన్నారు. పారికర్​ ఆదివారం కన్నుమూశారు. భాజపా ఎమ్మెల్యే ఫ్రాన్సిస్​ జీ సౌజ ఇటీవలే మరణించారు. మరో ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసెంబ్లీలో జీఎఫ్​పీ, ఎంజీపీ పార్టీలు తలో మూడు సీట్లు ఉన్నాయి. ఎన్​సీపీకి ఒక సీటు ఉంది.

ఇదీ చూడండీ:గంటలో గోవా సీఎం ఎంపిక: భాజపా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.