గోవులను తరలిస్తున్నాడనే కారణంగా పెహ్లూఖాన్ అనే వ్యక్తిని ముక దాడి చేసి చంపిన ఘటనలో అళ్వార్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజస్థాన్‌లోని అళ్వార్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
అళ్వార్ కోర్టు అదనపు న్యాయమూర్తి ఈ మేరకు.. సంశయ లబ్ధి కింద నిందితులకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. దీనిపై కోర్టు నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అదనపు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఆదేశాలు అందిన తర్వాత అవసరమైతే హైకోర్టుకు వెళతామని పేర్కొన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు మైనర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేకంగా బాలల న్యాయస్థానంలో వారిపై విచారణ జరుగుతోంది.
రెండు సంవత్సరాల క్రితం... అళ్వార్ జిల్లాలోని బెహ్‌రోర్ వద్ద ఆవులను తరలిస్తుండగా.. పెహ్లూఖాన్ సహా ఆయన ఇద్దరు కుమారులపై మూకదాడి జరిగింది. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత హెహ్లూ ఖాన్ మరణించాడు. ఈ ఘటనపై అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది.
ఇదీ చూడండి: అడ్వాణీకి జ్వరం... స్వాతంత్య్ర వేడుకలకు దూరం